Surprise Me!

Modi's visit confirmed to launch Hyderabad Metro

2017-11-22 465 Dailymotion

CM KCR received the confirmation of Modi’s visit to the Miyapur metro station from Prime Minister’s Office.
మెట్రో ప్రారంభంపై ఉన్న అన్ని అనుమానాలు తీరిపోయాయి. ఇప్పటికే సీఎంఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు ప్రధాని కార్యాలయం కూడా స్పష్టతనిచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది.

ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలు.. నవంబర్ 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
అనంతరం 3.25కి వారంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. మోడీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు వస్తారు. ఆ తర్వాత స్టేషన్‌ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు.