Surprise Me!

Jabardasth Hyper Aadhi Issue : Opinion

2017-11-27 1,068 Dailymotion

Mahesh kathi and a group of people from an Orphanage has filed a case on Hyper Aadhi at Saifabad Police station and filed a petition with HRC as well to take action on him.

నటి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్న 'జబర్దస్త్' కార్యక్రమంపై హెచార్సీ(మానవ హక్కుల సంఘం) ఫిర్యాదు అందింది. ఈ కామెడీ షోలో అభ్యంతకరంగా వ్యాఖ్యలుంటున్నాయని హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ శనివారం హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
అంతేగాక, హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. షోలో తమ మనోభావాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని మహేష్ తెలిపాడు. తన మద్దతు అనాథలకే అని చెప్పాడు.ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు.