Prapancha Telugu Mahasabhalu 2017 grandly started in hyderabad on December 15th. It will be continued to till December 19th. In this occassion, Oneindia.com has taken user feedback from the participants.
ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన ఎలా ఉందంటే... జనగాం నుంచి వచ్చిన విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎల్బి స్టేడియంలో ఎర్పాట్టు చేసిన స్వాగత వేడుకలో చెప్పిన విధంగా పది రోజులల్లో భాష పండితుల కష్టాలను నెరవేరుస్తా అంటు ఇచ్చిన హామీ నిజంగా మాకు వరం లాంటిదే ఇంతకు ముందు చెప్పిన మాటల్లా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాలి అని అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబరంగా ప్రారంభమయ్యాయి.