India announced a significant revamp of the goods and services tax (GST) framework, including cuts in the rates on 20-litre packaged drinking water, biodiesel, diamonds and precious stones, sugar candies, tailoring services, amusement parks and low-cost housing construction services.
జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం పలురకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గిస్తూ వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ దృష్ట్యా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.
తాజా సమావేశంలో 29 వస్తువులు, 53 సేవలపై పన్ను రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వీటిలో ముఖ్యంగా హస్తకళల వస్తువులు ఉన్నాయని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా గురువారం జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం నిర్వహించింది. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు కూడా దీనికి హాజరయ్యారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. 29 రకాల హస్తకళ వస్తువులను 0% శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించినట్టు ప్రకటించారు. మార్పులు చేసిన జీఎస్టీ రేట్లను జనవరి 25 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
జీఎస్టీ తాజా సమావేశంలో రిటర్నులు, ఫైలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే అంశంపైనా చర్చించారు. రూ.50 వేలకు పైబడిన సరుకుల అంతర్‌రాష్ట్ర రవాణాకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ వేబిల్లు (ఈ-వేబిల్లు)ను పొందుపర్చాలన్న నిబంధనను ఫిబ్రవరి 1నుంచి కచ్చితంగా అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అయితే కీలక అంశమైన పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని, వచ్చే సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశముందని జైట్లీ వివరించారు.