Surprise Me!

Kalyan Ram Next Film Is A Suspense Thriller

2018-02-07 879 Dailymotion

Kalyan Ram decide to do all type of charecters. Kalyan Ram said ok to debut director for a suspense thriller based movie.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్నింటికీ సిద్దపడిపోయినట్లు ఉన్నాడు. నందమూరి హీరో సినిమా అంటే అభిమానుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల్ని అందుకోవడం కొంచెం కష్టమే. కొన్ని రకాల కథలు బావున్నా, అభిమానుల అంచనాల దృష్ట్యా స్టార్ హీరోలు వాటికి కమిట్ కాలేరు. కానీ కళ్యాణ్ రామ్ అన్నింటికీ తెగించేసినట్లు ఉన్నాడు. నూతన దర్శకుడు వినిపించిన వింత తరహా కథకు కళ్యాణ్ రామ్ ఒకే చెప్పాడనేది తాజా సమాచారం.
కళ్యాణ్ రామ్ కు వరుసగా ప్లాపులు ఎదురవుతున్న తరుణంలో పటాస్ చిత్రం ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. పటాస్ చిత్రం కళ్యాణ్ రామ్ కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. అంతలోనే కళ్యాణ్ రామ్ కు ఇజం, షేర్ రూపంలో ప్లాపులు ఎదురయ్యాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ కు అంతగా కలసి రాలేదనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో అతి పెద్ద విజయం అతనొక్కడే. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. అప్పటి నుంచి కళ్యాణ్ రామ్, సురేందర్ రెడ్డి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ 2 చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించాడు. కిక్ 2 కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలు మిగిల్చింది.
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఎమ్మెల్యే పేరుతో పొలిటికల్ కథ ఒకటైతే, మరొకటి నా నువ్వే చిత్రం. ఈ రెండు చిత్రాలు వేసవి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన దర్శకుడు విజయ్ మద్దల వివరించిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ కళ్యాణ్ రామ్ కు బాగా నచ్చిందట. ఈ కథలోని ట్విస్ట్ లు కళ్యాణ్ రామ్ ని ఆశ్చర్యానికి గురి చేశాయని, దీనితో దర్శకుడికి వెంటనే ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.