Sai dharam Tej's Intelligent movie big Flop than Pawan kalyan's Agnyaathavaasi movie. This is the fifth failure for Saidahram Tej in a row.
అజ్ఞాతవాసి వంటి ఘోరమైన పరాజయంతో ఈ సంవత్సరం సినిమా ఏడాది ప్రారంభం అయింది. మెగా ఫాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం వారిని పూర్తిగా నిరాశ పరిచింది. అజ్ఞాతవాసి చిత్రం తరువాత మెగా ఫ్యామిలీ నుంచి మరో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వారిలో ఒకటి సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రం కాగా మరొకటి వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ చిత్రం.
వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం మెగా ఫాన్స్ ఆశలు నిలబెట్టే విధంగా ఉంటూ వసూళ్ల వర్షంతో దూసుకుపోతోంది. కానీ సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రం మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దర్శకుడు వినాయక్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఈ చిత్రం అజ్ఞాతవాసి కన్నా భారీ డిజాస్టర్ అని ట్రెండ్ పండితులు తేల్చేస్తున్నారు
ఇంటెలిజెంట్ చిత్రం అంచనాలు లేకుండా విడుదలైంది. కనీసం సరైన ప్రచార పద్ధతులని అవలంభించని చిత్ర యూనిట్ ఓపెనింగ్స్ విషయంలో దారుణంగా నష్టపోయింది. ఇంటెలిజెంట్ చిత్రానికి ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి.
ఇంటెలిజెంట్ చిత్రం మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీనితో వసూళ్లు పడకేశాయి. కనీసం వివి వినాయక్ మ్యాజిక్ కూడా పనిచేయలేదు. మరుసటి రోజే వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం విడుదల కావడంతో ఇంటెలిజెంట్ పరిస్థితి దయనీయంగా మారింది.
వివి వినాయక్, సాయిధరమ్ తేజ్ చిత్రం కావడంతో ఈ చిత్రానికి మంచి ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 27 కోట్ల వరకు ఈచిత్రాన్ని అమ్ముకున్నారట. ఇందులో 70 శాతం వరకు బయ్యర్లు నష్టాలు మిగలొచ్చని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రం దాదాపు 60 శాతం నష్టాల్ని మిగిల్చింది.