Surprise Me!

Credit Card Scam In Hyderabad Cracked

2018-02-24 1 Dailymotion

The city police have cracked a major fraud with usage of credit cards that was going on in the city for over five years and have arrested 10 persons in this connection. It is learnt that a fraud to the tune of Rs 1.5 crores has been done on four banks through the credit cards.

ఒక డబ్బా కంపెనీ సృష్టించి అందులో 41మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు ఫేక్ ఐడీలు కూడా సృష్టించి.. క్రెడిట్ కార్డులతో బ్యాంకులను బురిడీ కొట్టించిన కుంభం రంగారెడ్డి కేసులో పోలీసులు కీలక వివరాలు సంపాదించారు.ఏయే బ్యాంకు నుంచి ఎంత తీసుకున్నది?, ఇందుకోసం ఎవరెవరిని వాడుకున్నది గుర్తించారు. నిందితుడి కూపీ లాగడంలో '360 డిగ్రీస్‌ వ్యూ' అనే సాఫ్ట్‌వేర్‌ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. గురువారం చిక్కిన ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో రెండు బ్యాంకులకు అధికారిక సమాచారం ఇచ్చేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది.
పర్ణిక నానో సొల్యూషన్‌ అనే డబ్బా కంపెనీని క్రియేట్ చేసిన రంగారెడ్డి.. నకిలీ పత్రాలతో హెడ్‌డీఎఫ్‌సీ నుంచి 48 కార్డులు తీసుకుని రూ.45.72 లక్షలు, ఎస్బీఐ నుంచి 33 కార్డులు తీసుకుని రూ.25.29 లక్షలు, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ నుంచి 41 కార్డులు తీసుకుని రూ.77.9 లక్షలు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి 3 కార్డులు తీసుకుని రూ.3.26 లక్షలు డ్రా చేశాడు.
లేని ఉద్యోగుల పేరిట నకిలీ ఐడీలు, ధ్రువపత్రాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన రంగారెడ్డి.. ఫోన్ నంబర్స్ విషయంలోనూ జాగ్రత్తపడ్డాడు. క్రెడిట్ కార్డు వాలిడిటీ ముగిసేవరకు ఉపయోగించుకుని.. ఆపై దానికి లింక్ చేసిన సిమ్ కార్డును పారేసేవాడు. ఆ తర్వాత బ్యాంకు అధికారులు వీరిని సంప్రదించేందుకు ప్రయత్నించినా.. ఫోన్ నంబర్స్ పనిచేయవు. బ్యాంకులకు ఇచ్చిన చిరునామా కూడా తప్పని తేలి ఏమి చేయని పరిస్థితి.
360డిగ్రీస్ సాఫ్ట్ వేర్'తో నేరస్తులను గుర్తించడంలో పోలీసుల పని సులువవుతోంది. కుంభం రంగారెడ్డిని కూడా ఇదే సాఫ్ట్ వేర్ ఉపయోగించి గుర్తించారు పోలీసులు. ఈ సాఫ్ట్ వేర్ లో పాత నేరస్తులకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్, రేషన్‌కార్డ్, ఓటర్‌ గుర్తింపు కార్డుల వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి. పేర్లలో స్పెల్లింగులు మార్చుకున్నా దీని ద్వారా గుర్తించవచ్చు. అలాగే సదరు నేరస్తుల పేరుపై ఉన్న సిమ్ కార్డులు, వాహనాల వివరాలు కూడా ఇది అందిస్తుంది.