Surprise Me!

Sridevi's last moments Confusion : Who found Sridevi's unconscious

2018-02-26 5,686 Dailymotion

Sridevi suffered a cardiac arrest and was rushed to the hospital. While a gulf-based newspaper reports that she was with Boney Kapoor in her hotel room at that time
నటి శ్రీదేవి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం పూర్తయింది. కాసేపట్లో ఆమె మృతదేహాన్ని అప్పగించనున్నారని తెలుస్తోంది. పోస్టుమార్టం, మృతదేహం అప్పగింత విషయంలో జాప్యం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి మృతదేహానికి దాదాపు 36 గంటల తర్వాత కూడా దుబాయ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. పోస్టుమార్టం పూర్తి అయిన నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి రాగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. పోలీసులు న్యాయపరమైన క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

శ్రీదేవి పోస్టుమార్టం, ఆమె మృతదేహాన్ని భారత్ తరలించే ప్రక్రియను దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని ప్రత్యేక ప్రయివేటు జెట్‌లో ముంబై తరలించనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఆ విమానం బయలుదేరే అవకాశముంది. ప్రస్తుతం పోలీస్ మార్చురీలో శ్రీదేవి మృతదేహం ఉంది. మరో గంటన్నర వరకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. దుబాయ్‌లోని మొహాసీనాలో భౌతికకాయానికి ఎంబామింగ్ చేస్తారు. ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ జారీ చేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా శ్రీదేవి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.