Surprise Me!

IPL 2018: Chennai Super Kings Entertain Fans

2018-03-30 84 Dailymotion

Harbhajan Singh posted a selfie writing, "Going for our first practice session in open bus.. how cool#whistlepodu."

మహేంద్ర సింగ్‌ ధోనీ సేన ఓపెన్‌ టాప్‌ బస్సులో తిరుగుతూ సందడి చేసింది. జట్టు ఆటగాళ్లకు సందడిగానూ.. రాబోయే ఐపీఎల్ ప్రమోషన్ గానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులందరూ డ్యాన్స్‌లు వేస్తూ. ఆటోల్లో తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ధోనీ, బ్రావో, కర్ణ శర్మ, భజ్జీ తదితర ఆటగాళ్లు అభిమానులకు హాయ్‌ చెబుతూ, విక్టరీ గుర్తు చూపుతూ సందడి చేశారు. బ్రావో ఓ పాటకు డ్యాన్స్‌ కూడా వేశాడు.
మరో 8 రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌కు వెళ్లేందుకు ఓపెన్‌ టాప్‌ బస్‌ను ఎంచుకుంది. ఇక దీంతో ఆటగాళ్ల సరదాకు అవధులు లేకుండాపోయింది. వారంతా చిన్న పిల్లల్లా మారిపోయి అల్లరి చేశారు. వీరి బస్సును అనుసరిస్తూ వేలాది మంది అభిమానులు మైదానానికి చేరుకున్నారు. అభిమానులతో మైదానం నిండిపోయింది.
మైదానం వెలుపల అటుగా వెళ్లే వారు అంత పెద్ద సంఖ్యలో అభిమానులను చూసి ఏదైనా మ్యాచ్‌ జరుగుతుందా అని ఆశ్చర్యపోయారంటే నమ్మండి. అంత భారీగా తరలివచ్చారు. ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటే గ్యాలరీల నుంచి అభిమానులు కేరింతలు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. ధోనీ నామస్మరణతో మైదానం మారుమోగిపోయింది.
కొద్ది రోజుల క్రితం నెట్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన ధోనీ ఇప్పుడు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో ఆటగాళ్లకు బంతులేస్తూ కనిపించాడు. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) క్యాంపులోనూ ధోనీ బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. ఈ ఫొటోలను సీఎస్‌కే యాజమాన్యం తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది.