Surprise Me!

Singer Sivanagulu Is Quite Unhappy With Rangasthalam

2018-04-03 1,560 Dailymotion

Singer Sivanagulu is quite unhappy with Rangasthalam Movie as his song ‘Aa Gattununtaava’ was replaced by that of Music Director Devi Sri Prasad himself, all of a sudden, without any prior intimation to him.

'రంగస్థలం' సినిమాలో బాగా హైలెట్ అయిన అంశాల్లో సంగీతాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆడియో ఆల్బం సూపర్ హిట్ అవ్వడం సినిమాకు మరింత ప్లస్ అయింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలోని పాటపై వివాదం నెలకొనడం, ఆ పాట పాడిన సింగర్ మీడియా వరకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.
ఈ చిత్రంలో ‘ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టకొస్తావా' అనే పాటను ఫోక్ సింగర్ శివ నాగులు పాడారు. సినిమా విడుదల ముందే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఆడియో వేడుకలో కూడా సింగర్ శివ నాగులును వేదికపైకి పిలిచి అప్రిషియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ. అయితే సినిమా విడుదలైన తర్వాత అందులో శివ నాగులు వాయిస్ కాకుండా దేవిశ్రీ వాయిస్ రావడంతో అంతా షాకయ్యారు.
ఇలా ఎందుకు జరిగిందో తన వద్ద సమాధానం లేదు అంటున్నారు సింగర్ శివ నాగులు. దీనిపై ఆయన మాట్లాడుతూ... సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా దేవిగారు నాతో చాలా బాగా మాట్లాడారు. సూపర్‌గా పాడావు అని ప్రశంసించారు. అక్కడి వరకు బాగానే ఉంది. సినిమా విడుదలైన తర్వాత మార్నింగ్ షోకు మా ఫ్రెండ్స్ అంతా వెళ్లారు. సినిమా చూసి నీ వాయిస్ కాదు అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. మధ్యాహ్నం 2 గంటల షోకు నేను వెళ్లిన చూసిన తర్వాత అది నా వాయిస్ కాదు దేవిశ్రీ వాయిస్ అని అర్థమైంది. దీని గురించి చాలా మంది నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎందుకు ఇలా జరిగింది అంటే నా వద్ద సమాధానం లేదు.... అని శివ నాగులు అన్నారు.
ఇలా ఎందుకు మార్చారో తెలియదు. నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. నా బాధంతా ఒకటే. నాకు ఒక్క మాట ముందే చెప్పి ఉంటే గుండె ధైర్యం చేసుకుని ఉండేవాడిని. నా అభిమానులు, ఫ్రెండ్స్ చాలా మంది శివ నాగులు పాడాడు అనే సంతోషంతో వెళ్లారు. అందులో వాయిస్ లేక పోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. వారు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేక చచ్చిపోయాను... అని ఆవేదన వ్యక్తం చేశారు.