Srinivasa Kalyanam is out and it promises to be the romantic fare that Nithin’s fans will look forward to. now movie in second schedule, dil raju announced release date of this film.
తాజాగా శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు సతీష్ వేగ్నేష్ నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాత సినిమా విడుదల తేదిని ప్రకటించడం జరిగింది.
ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. గోదావరి జిల్లాల్లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ అయిపోయింది. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. రాసి ఖాన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా నందిత శ్వేతా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా యూనిట్ చండీఘర్ చేసుకుంది. శ్రీనివాస కళ్యాణం రెండో షెడ్యూల్ మొదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాటలాడుతూ.. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. జూలై 24న సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. సో నితిన్ పెళ్లి మరో మూడు నెలల్లో జరగబోతుందన్నమాట.
నితిన్ గతేడాది నటించిన లైతో పాటు మొన్నొచ్చిన ఛల్ మోహన్ రంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని నితిన్ కసి మీద ఉన్నట్లు సమాచారం. శతమానం భవతి సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసిన ఈ డైరెక్టర్ శ్రీనివాస కళ్యాణం సినిమాను చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.