Surprise Me!

Who is The Next Hero in Koratal Siva New Movie???

2018-04-26 497 Dailymotion

Koratala Siva to join hands with Allu Arjun. Curiosity rises over Koratala next movie.

వరుసగా నాలుగు విజయాలు సాధించిన దర్శకుడు, హీరోలు ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్స్ అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే కొరటాల శివ పేరు గుర్తుకు వస్తుంది. రొటీన్ కమర్షియల్ చిత్రాల తరహాలో కాకుండా.. కమర్షియల్ అంశాలు ఉంటూనే సందేశాన్ని ఇవ్వడం కొరటాల స్టైల్ అని అర్థం అయిపోయింది సినీ ప్రేక్షకులకి . ప్రతి చిత్రంలోనూ కొరటాల శివ అంతర్లీనంగా ఎదో ఒక సందేశాన్ని ఇస్తున్నారు. తాజాగా భరత అనే నేను చిత్రంతో కొరటాల శివ పేరు మారుమోగుతోంది. భరత్ అనే నేను చిత్రం కొరటాలకు వరుసగా నాలుగవ ఘనవిజయంగా నిలిచింది. దీనితో కొరటాల నెక్స్ట్ మూవీ ఏంటనే ఆసక్తి అందరిలో ఎక్కువైపోతోంది.
కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇటీవల విడుదలైన భరత్ అనే నేను చిత్రాలని గమనిస్తే సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. అభిమానులకు కావలసిన కమర్షియల్ ఎలిమెంట్స్ అందిస్తూనే తాను చెప్పాలనుకున్నా సందేశాన్ని విజయవంతంగా ప్రేక్షకులకు చేరవేస్తున్నారు.
తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. దీనితో కొరటాల నెక్స్ట్ మూవీ ఎవరితో అనే ఆసక్తి అందరిలో ఎక్కువైపోతోంది.
టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం, మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం కొరటాల నెక్స్ట్ మూవీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలంతా వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రమే నా పేరు సూర్య చిత్రం తరువాత ఖాలిపడనున్నాడు. దీనితో ఈ ఊహాగానాలు మొదలవుతున్నాయి.