Surprise Me!

"Dark Secrets" :BBC Creating A Documentry On Industry Culture

2018-04-27 1,430 Dailymotion

I was asked for Physical favours says Usha Jadhav. Usha Jadhav reveals shocking facts about Bollywood.
కాస్టింగ్ కౌచ్ పై దేశవ్యాప్తంగా పోరాటం ఉదృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. కాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అగ్గి రాజేసుకుంది. నేరుగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసి బాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి బాలీవుడ్ డార్క్ సీక్రెట్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేయనుంది. ఈ డాక్యుమెంటరీ కోసం ప్రముఖ హీరోయిన్లు సంచలన విషయాలు వెల్లడించారు. రాధికా ఆప్టే, ఉషా జాదవ్ వంటి ప్రముఖ హీరోయిన్లు ఈ డాక్యుమెంటరీలో భాగమైన బాలీవడ్ లో జరుగుతుం చీకటి కోణాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. హాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై మీ టూ అనే పెద్ద ఉద్యమమే సాగుతోంది.ఇండస్ట్రీలో కొంత మంది తమకు తామే దేవుళ్లమని భావిస్తారని వారికీ ఎదురు తిరిగితే కెరీర్లు నాశనం అయినట్లే అని రాధికా ఆప్టే పేర్కొంది. మహిళలు, పురుషులు కలసి కట్టుగా ముందుకు వచ్చి దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని రాధికా ఆప్టే పేర్కొంది.
జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హీరోయిన్ ఉషా జాదవ్ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఇలాటి అనుభవం ఎదురైందని తెలిపింది. అవకాశం రావాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని చెప్పారని వ్యాఖ్యానించింది. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న అమ్మాయిలు అంతా ముందుకు వచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఉషా జాదవ్ పేర్కొంది.
#Usha Jadhav
#Bollywood