Surprise Me!

Danush Makes Sensational Comments On a Director

2018-05-10 4,983 Dailymotion

Superstar Rajinikanth's much-anticipated film Kaala Audio launch was held yesterday at the YMCA grounds in Nandanam, Chennai. The crew of Kaala including Rajinikanth, director Pa Ranjith and producer Dhanush graced the event. After speaking about Rajinikanth's sincerity, Dhanush took a jibe at ace director Bharathiraja and others who have been openly criticising the Superstar in the recent times.
#KaalaAudiolaunch
#Rajinikanth
#Dhanush

కబాలి సెన్సేషనల్ హిట్ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాలా. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలోని నందనంలో వైఎంసీఏ మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్, నిర్మాత ధనుష్ పాల్గొన్నారు.
ఇటీవల రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లోకి రజనీ ప్రవేశంపై దర్శకుడు భారతీరాజా అభ్యంతరం వ్యక్తం చేశాడు. రజనీ తమిళేతరుడు. ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగారు. అలాంటి వ్యక్తి తమిళ రాజకీయాల్లోకి రావడమేంటీ అని భారతీరాజా విమర్శించారు.
చెన్నైలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న శ్రీమాన్, భారతీరాజా, ఇతర వ్యక్తులపై రజనీకాంత్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రజనీపై భారతీ రాజా తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటక ప్రయోజనాలను ఆశించే దూత అని వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీ, భారతీరాజా కలిసి పలు చిత్రాలకు పనిచేశారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.
ఈ వేడుకలో అభిమానులను ఉద్దేశించి రజనీ అల్లుడు, నటుడు, నిర్మాత ధనుష్ మాట్లాడారు.రజనీకాంత్‌కు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. అందుకే ఆయనపై ప్రశంసలు గుప్పించాను. కానీ ఆయన నుంచి నేర్చుకొన్న గొప్ప విషయాలను మీకు చెప్పాలనుకొంటున్నాను అని ధనుష్ అన్నారు. తన ప్రసంగంలో రజనీ గొప్ప విషయాలను ప్రస్తావిస్తూనే ఆయనపై ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్న దర్శకుడు భారతీరాజాపై విరుచుకుపడ్డారు.
ఏ వ్యక్తి అయినా పేరు, ప్రఖ్యాతులు సంపాదించాలంటే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి బాగా కష్టపడి, చమటోడ్చటం ద్వారా దానిని సాధించవచ్చు. రెండవది మార్గం ఏమిటంటే.. ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తులను విమర్శించడం ద్వారా అది సాధిస్తారు. రజనీ సార్‌తో పనిచేసి బాగా డబ్బు సంపాదించిన కొందరు వ్యక్తులు ఆయనను విమర్శిస్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారు అని దర్శకుడు భారతీరాజాపై ధనుష్ మండిపడ్డారు.