Surprise Me!

Tammareddy Baradwaj Counters On Media

2018-05-10 314 Dailymotion

Tammareddy Bharadwaj gives counter to media.He talks about Mega family
#TammareddyBharadwaj
#Megafamily

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఇండస్ట్రీలో జరుగుతున్న ఘటనల గురించి ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్ధం ప్రకటించిన తరువాత పరిణామాలు వేగంగా మరాయి. కొన్ని మీడియా సంస్థలని బ్యాన్ చేయడానికి కుడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదంతా అపోహ మాత్రమే అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.ఇండస్ట్రీ, మీడియా పాలు నీళ్ళ లాంటివని అన్నారు.
చిత్ర పరిశ్రమ గురించి మీడియాలో అపోహలు పెరుగుతున్నాయని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇటీవల ఇండస్ట్రీలో అనుకోని పరిణామాలు చేసుకున్నాయని అందువలనే ఇండస్ట్రీలోని ప్రముఖులంతా చిరంజీవి నేతృత్వం వహించిన సమావేశానికి హాజరయ్యారని అన్నారు. మీడియాని బ్యాన్ చేయడానికే ఈ సమావేశాలు అంటూ వస్తున్న ఊహాగానాల ఆధారంగా అపోహలకు పోవడం కరెక్ట్ కాదని అన్నారు.
ఇండస్ట్రీ సమస్యని తీర్చడానికి అందరికి ఒక సమయంలో ఆసక్తి వస్తుంది. అందుకే అంతా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ చెప్పారనో, చిరంజీవి సమావేశం నిర్వహించారనో కాని తమ్మారెడ్డి అన్నారు. ఇందులో మీడియాని బ్యాన్ చేసే ఉద్దేశం లేదని అన్నారు.
ఇండస్ట్రీని నియంత్రించడానికి మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తల గురించి తమ్మారెడ్డి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఫ్యామిలీలు ఉన్నాయి. కాని ఫ్యామిలీలకు ఇండస్ట్రీ లేదని అన్నారు. ఇండస్ట్రీని ఏ ఒక్క ఫ్యామిలీయో నియంత్రించలేదని అన్నారు.