Surprise Me!

"Mahanati" To Join 2 Million Club At Us Box Office Soon

2018-05-14 281 Dailymotion

Keerthy Suresh, Dulquer Salman, and Samantha starrer Mahanati is having a dream run at the US box office. Trade analysts believe that the film is poised to join the $2 million club. It is also expected to be one of the most profitable Telugu films in the US in recent times.

కీర్తీ సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ 'మహానటి' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి $1.28 మిలియన్ క్రాస్ అయింది. త్వరలోనే ఈ మూవీ $2 మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆస్ట్రేలియా, యూకె, కెనడా, న్యూజిలాండ్ ఏరియాల్లో సైతం 'మహానటి' బాక్సాఫీస్ కలెక్షన్స్ అదిరిపోయే విధంగా ఉన్నాయి.
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘మహానటి' యూఎస్ఏ కలెక్షన్స్ వివరాలు వెల్లడించారు. ఈ చిత్రం అమెరికాలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోందని, త్వరలోనే 2 మిలియన్ డాలర్ మార్కను అందుకుంటుందని తెలిపారు.
‘మహానటి' చిత్రం యూఎస్ఏ వ్యాప్తంగా 142 లొకేషన్లలో ప్రదర్శిస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ప్రీమియర్ షోలతో కలిపి బుధ, గురు వారాల్లో $ 637,737 వసూలు చేసింది. శుక్రవారం $ 251,125 వసూలు చేయగా, శనివారం $ 396,236 రాబట్టింది. ఆదివారం వసూళ్ల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ నెంబర్స్ యాడ్ అయితే ఓవరాల్ కలెక్షన్ 1.5 మిలియన్ మార్కను క్రాస్ అవుతుంది.
కెనడాలో కూడా ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు సాధిస్తోందని తరణ్ ఆదర్శ్ తెలిపారు.