Surprise Me!

IPL 2018: Ranveer Singh Hails 'King Kohli' On Twitter

2018-05-19 40 Dailymotion

One of the most exciting games of the ongoing Indian Premier League (IPL) 2018 saw Virat Kohli-led Royal Challengers Bangalore live to fight another day as they fended off SunRisers Hyderabad's counter-attack to win the cliff-hanger by 14 runs at M Chinnaswamy Stadium in Bengaluru on Thursday.

చేజారిపోయిందనుకున్న ప్లేఆఫ్ ఆశలు మళ్లీ చిగురించాయి. బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. కోహ్లీ కెప్టెన్సీలో కొనసాగుతోన్న రాయల్ బెంగళూరు జట్టుకు వరుసగా ఇది మూడో విజయం. ఆఖరి వరకూ పోరాడినా హైదరాబాద్ 14పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అయితే ఈ విజయం గురించి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చాడు.
ఈ ట్వీట్‌లో రణవీర్ సింగ్.. కోహ్లీ, డివిలియర్స్, కేన్ విలియమ్‌సన్‌లను తెగ పొగిడేశాడు. బెంగళూరు ఇప్పటికీ మిగిలిన జట్లకు సవాలు విసురుతోంది. అస్సలు కింగ్ కోహ్లీ లేకుండా ఐపీఎల్ ఉంటుందా..? సన్‌రైజర్స్ జట్టు తీవ్రమైన పోటీనిచ్చింది అయినా సరే బెంగళూరు గెలిచి చూపించింది.
ప్లేఆఫ్ ఆశలు నిలుపుకునేందుకు చావో రేవో అనే రీతిలో పోరాడిన బెంగళూరుకు మంచి విజయమే దక్కింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెటర్లు ఆద్యంతం అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు బెంగళూరు ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయినా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను కనబరిచింది.
ఈ విజయంతో బెంగళూరు 12పాయింట్లతో లీగ్ పట్టికలో 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా తదుపరి మ్యాచ్ బెంగళూరు జైపూర్ వేదికగా రాజస్థాన్‌తో తలపడనుంది. ఒకవేళ రాజస్థాన్ తో ఆడి గెలిస్తే ఇక బెంగళూరు ప్లేఆఫ్ కు వెళ్లేందుకు కోల్‌కతా ఒక్కటి గెలవాల్సి ఉంటుంది.