Surprise Me!

NTR Thanks To His Fans

2018-05-21 1,343 Dailymotion

NTR emotional tweets to his fans. AravindhaSamethaFirstLook gets overwhelming response

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 35 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకున్నారు. సినీ ప్రముఖులు యంగ్ టైగర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఎన్టీఆర్ అభిమానుల సంతోషాన్ని పెంచింది చిత్ర యూనిట్. అరవింద సమేత వీర రాఘవ అనే అద్భుతమైన టైటిల్ ని త్రివిక్రమ్ ఖరారు చేసారు. వెల్లువలా వచ్చిన పుట్టిన రోజు శుభాకాంక్షలతో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ గా రిప్లై ఇచ్చాడు.
సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాలు స్టైలిష్ గా ఉంటూ, ఫ్యామిలీ, క్లాస్ టచ్ ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం గురించి కూడా అంతా అలాగే అనుకున్నారు. కానీ ఫస్ట్ లుక్ చూసి అభిమానులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. సిక్స్ ప్యాక్ లుక్ లో ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించాడు. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి మాస్ లుక్ ఎవరూ ఉహించలేదు.
అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ కు వస్తున్న రెస్పాన్స్ పై ఎన్టీఆర్ స్పందించాడు. అభిమానులందరి స్పందన అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ తెలిపాడు. ఇంతకు మించి ఎక్కువ అడగను అని తెలిపాడు.
తన 35 ఏళ్ల జీవితంలో 18 ఏళ్ళు నటనతోనే గడిపానని ఎన్టీఆర్ తెలిపాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎత్తుపల్లాలు చూశానని, అని సందర్భాల్లో మీ ప్రేమాభిమానాలు స్థిరంగా ఉన్నాయని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.
మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ తెలిపాడు. అంత ప్రేమని తిరిగి ఇవ్వలేనని కూడా ఎన్టీఆర్ అభిమానులనిఉద్దేశించి ట్విటర్ లో స్పందించాడు. పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షల పట్ల ఎన్టీఆర్ ఇలా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు.