Surprise Me!

Bigg Boss Tamil Season 2 Promo

2018-05-21 1 Dailymotion

Bigg Boss Tamil season 2 promo. Kamal Haasan returns with the second promo of the second season

టివి రియాలిటీ షోలలో బిగ్ బాస్ పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు. హిందీ, తమిళం తెలుగు ఇలా భాషా బేధం లేకుండా బిగ్ బాస్ షో కు బుల్లితెర ప్రేక్షకులను బ్రహ్మరథం పడుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ప్రేక్షకులకు ఆసక్తితోపాటు, వినోదాన్ని కలిగించేందుకు ప్రతి సీజన్ లో కొత్త మసాలా దట్టిస్తున్నారు. తమిళంలో తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన విశ్వ నటుడు కమలే రెండవ సీజన్ కు కూడా హోస్ట్. తాజగా నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 2 ప్రోమోని విడుదల చేశారు. ఈ సారి బిగ్ బాస్ ఎంత వెరైటీగా ఉండబోతోందో ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు.
ఈ ప్రోమోలో ఓ అంశాన్ని మనం చూసే కోణాన్ని బట్టి మన అభిప్రాయాలు మారుతుంటాయని కమల్ తన స్టైల్ లో వివరించారు. ఓ చక్కటి సన్నివేశంతో కమల్ ఈ విషయాన్ని వివరించారు.
ప్రోమోలో చూపిన సన్నివేశంలో ఓ వ్యక్తి మహిళని నెట్టేసి ఖంగారుగా పరిగెడుతుంటాడు. చుట్టుపక్కల ఉన్న అందరూ అతడిని తప్పుగా చూస్తారు. కానీ అతడు ఓ పిల్లాడిని యాక్సిడెంట్ నుంచి కాపాడతాడు. ఈ విషయాన్ని కమల్ ఎవరు మంచి వ్యక్తి అంటూ వివరిస్తాడు.
హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కంటెస్టెంట్స్ అందరిని క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుంది. తమిళంలో బిగ్ బాస్ తొలి సీజన్ కు మంచి రేటింగ్స్ వచ్చాయి. దీనితో నిర్వాహకులు కమల్ నే హోస్ట్ గా కొనసాగిస్తున్నారు. ఈ సారి 15 మంది కొత్త వారు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.