Surprise Me!

Actor Simbu Pays Tribute To His Fan

2018-05-21 335 Dailymotion

Actor Simbu Pays Tribute To His Fan .Simbu pay tribute to his fan. Video goes viral

ఇండియాలో సినీతారలపై ప్రేక్షకులు చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. హీరోల కోసం అభిమాన సంఘాలే ఉంటాయి. తమ అభిమాన హీరో సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కష్టపడి బ్యానర్స్, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తారు. అంతా హీరోపై అభిమానం చాటుకుంటారు. తమిళ హీరో శింబు తన అభిమాని కోసం చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశగా మారింది.
తమిళంలో శింబుకు మంచి క్రేజ్ ఉంది. యువతలో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. వారిలో చెన్నై లోని తేనాం పేటలో నివాసం ఉండే మదన్ కూడా ఒకరు. మదన్ స్టార్ హోటల్స్ లో పాటలు పాడుతుంటారు. ఇటీవల మదన్ ఓ వివాహ వేడుక కోసం పోస్టర్స్ అంటిస్తుండగా స్థానికంగా ఉన్నా యువకులతో వాగ్వాదం ఏర్పడింది. చిన్న వివాదంగా మొదలైన ఆ గొడవ చివరకు మదన్ ని హత్య చేసే వరకు దారితీసింది. ఇటీవల షూటింగ్ లో బిజీగా ఉన్న శింబు ఈ విషయం గురించి తెలుసుకున్నారు. వెంటనే మృతి చెందిన తాన్ అభిమాని కుటుంబాన్ని పరామర్శించాలని తండ్రి రాజేందర్ ని పంపించాడు. షూటింగ్ పూర్తైన తరువాత శింబు కూడా తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించాడు.
అనంతరం తన అభిమాని కోసం శింబు చేసిన పని వైరల్ గా మారింది. తన అభిమానికి శ్రద్ధాంజలి ఘటిస్తున కరపత్రాలని స్వయంగా శింబు ఆ ప్రాంతంలోని గోడలకు అంటించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.