Rajasthan Royals skipper Ajinkya Rahane promoted Jofra Archer up the order and his experiment failed as he Archer was dismissed for a 'Duck'.
#JofraArcher
#Record
#Cricket
#RajasthanRoyals
#IPL2018
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ ఓ చెత్త రికార్డుని నమోదు చేశాడు. ఐపీఎల్ 11వ సీజన్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన విండిస్ యువ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ మూడు సార్లు డకౌటయ్యాడు.
అయితే, ఇందులో రెండు గోల్డెన్ డక్‌లుండటం విశేషం. దీంతో అరంగేట్ర సీజన్‌లో ఇలా మూడు సార్లు డకౌట్ అయిన నాలుగో ఆటగాడిగా జోఫ్రా ఆర్చర్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇలా విన్సెంట్ (2011), రామ్‌పాల్(2013), గ్రాండ్‌హోమ్(2017)లు ఈ రికార్డుని మూటగట్టుకున్నారు.
తాజాగా జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్‌లో వీరి జాబితాలో చేరాడు. ఇదిలా ఉంటే
మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ ఆర్చర్ జోప్రా డకౌటవగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానె (33: 31 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి రాహుల్ త్రిపాఠి జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి అభేద్యంగా 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో రాజస్థాన్ భారీ స్కోరు దిశగా సాగింది.