Surprise Me!

Director Sukumar Excellent Speech On Social Media

2018-05-22 665 Dailymotion

Director Sukumar Comments On Present Social Media. Sukumar attends an event and comments on misusing social media
#rangasthalam
#DirectorSukumar
#SocialMedia

రంగస్థలం లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన తరువాత దర్శకుడిగా సుకుమార్ కొత్త స్థాయికి చేరుకున్నారు. రంగస్థలం చిత్రంతో ఈ దర్శకుడు అంతా మ్యాజిక్ చేసాడు. తన దర్శకత్వ ప్రతిభ ఎంత పదునైనదో సుకుమార్ మరో మారు నిరూపించాడు. 1980 లాంటి పల్లెటూరి వాతావరణాన్ని రంగస్థలం చిత్రంలో సుకుమార్ అద్భుతంగా ఆవిష్కరించాడు. తాజాగా సుకుమార్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహించే సంస్థ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అప్పట్లో ఉన్న వ్యవస్థ, ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా గురించి సుకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తమ జనరేషన్ లో మంచి పత్రికలు, చెడు పత్రికలు రెండూ ఉండేవని సుకుమార్ తెలిపారు. ఓ కిల్లి షాప్ దగ్గరకు వెళితే అక్కడ మంచి పత్రికలు, అర్థ నగ్న ప్రదరకతో కూడిన మ్యాగజైన్స్ దొరికేవి.
ఏది మంచి, ఏది చెడు అని చెప్పడానికి మా జనరేషన్ లో అంత్యత పవిత్రమైన ఉపాధ్యాయులు ఉండేవారు. ఈ జనరేషన్ లో అది కరువైందని సుకుమార్ అన్నారు. తాము కనీసం అబద్దం చెప్పడానికి కూడా భయపడే వాళ్ళం అని సుకుమార్ అన్నారు.
అశ్లీల చిత్రాలతో కూడిన మ్యాగజైన్స్ వైపు చూడడానికి కూడా మేము సాహసించే వాళ్ళం కాదు. ఎవరైనా అవి చదువుతున్నారని తెలిస్తే వాడు చెడిపోయాడు అని భావించే వాళ్ళం అని సుకుమార్ తెలిపాడు.