Surprise Me!

Renu Desai Getting Married Again

2018-06-22 2 Dailymotion

Renu Desai announced that she has found love again. Without revealing the identity of her lover, she shared a photo on Instagram of herself holding hands with a mystery man.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన ఆమె తన పిల్లలతో కలిసి కొన్నేళ్లుగా పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే తన సోల్ మేట్‌ను వెతుక్కున్న రేణు దేశాయ్ ప్రస్తుతం అతడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు ఆమె తన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు? అనేది మాత్రం రేణు దేశాయ్ వెల్లడించలేదు.
తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. స్విమ్‌ సూట్లో ఉన్న ఆమె తన చేతిలోని ఫోన్లో ఏదో మెసేజ్ చదువుతూ కనిపించారు. ఆ మెసేజ్ పంపింది ఎవరో కాదు ఆమె సోల్ మేటేనంట. అతడు పంపిన మెసేజ్ చదువుతూ ఉన్న తనను స్నేహితులు ఫొటోలు తీస్తూ ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొంది. దీన్ని బట్టి ఇద్దరి వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల తన కాబోయే భర్త చేతిలో చేయ్యేసుకుని దిగిన ఫోటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు' అని అని పేర్కొన్నారు.