Surprise Me!

Bigg Boss Season 2 Telugu : Ganesh Exhibits His Dissatisfaction

2018-06-23 495 Dailymotion

Bigg Boss housemates tonight. Bigg Boss became interesting day by day

బిగ్ బాస్‌ సీజన్‌ 2లో అసలు రచ్చ మొదలైంది. నాని అన్నట్టుగా ఇంకాస్త మసాలా దట్టించారు. హౌస్ మేట్స్ ఒకర్నొకరు తిట్టుకోవడం, దూషించుకోవడలతో ఆకకుండా కొట్టుకునే వరకూ వెళ్లింది. శుక్రవారం నాటి బిగ్ బాస్ షోకి కావాల్సిన అసలు సిసలు నాటకీయతను జోడించారు. ఇక 13 వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ రూల్స్‌ని అతిక్రమించిన కారణంగా బిగ్ బాస్ విధించిన కొవ్వత్తుల టాస్క్‌ను కంప్లీట్ చేయడానికి హౌస్ మేట్స్ చాలా కష్టపడ్డారు. తప్పైపోయింది బిగ్ బాస్ క్షమించండి అంటూ మొరపొట్టున్నారు. దీంతో కొవ్వొత్తుల శిక్షను ముగిసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్.
ఈ హౌస్‌లో కొనసాగాలంటే పుల్లలు పెట్టడం వచ్చి ఉండాలా అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు గణేష్. నాకు అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ చెప్పడం రాదని.. వాడు ఇట్టాంటోడా.. వీడు ఇట్టాంటోడు అంటూ పుల్లలు పెట్టి చెబితే అవునా.. అలాగా అంటూ విని తెగ ఆనందపడిపోతారని తనకు అలా చెప్పడం రాదంటూ హౌస్ మేట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గణేష్.
ఇక దీప్తి సునైనా ఇంటిని నీట్‌గా ఉంచడం లేదంటూ.. తన వల్ల తాను చాలా ఇబ్బందిపడుతన్నానంటూ మిగిలిన హౌస్ మేట్స్‌కి కొత్తగా వచ్చిన నందిని కంప్లైంట్ చేయడంతో దీప్తి సునైనా అసహనం వ్యక్తం చేస్తూ.. తన బట్టలను సర్దిపెట్టుకుంది. చిన్న పిల్ల ఆయితే షో కి ఎందుకు రావాలంటూ నందిని అసహనం వ్యక్తం చేసింది .