Surprise Me!

Rana Daggubati To Play Nara Chandrababu Naidu Role In NTR Biopic

2018-06-28 679 Dailymotion

టాలీవుడ్‌లో బయోపిక్‌ల నిర్మాణం జోరందుకున్నది. ఇప్పటికే మహానటి ఘన విజయం సాధించగా, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. అలాగే బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా హీరో సుధీర్ బాబు మరో బయోపిక్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌పై వస్తున్న రూమర్లకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. అవేమిటంటే..
గత కొద్దికాలంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్‌ను సంక్రాంతి 2019, రెండో భాగాన్ని 2019 మధ్య భాగంలో రిలీజ్ చేస్తారు అని మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం రెండు భాగాలు ఉండదు అని చిత్ర నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ బయోపిక్ జూలై 5వ తేదీ నుంచి హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, స్వర్గీయ రామారావు సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.
ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రను పోషించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ మేరకు రానాతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని తెలిసింది.