Surprise Me!

Ileana Re Entry Confirmed In Tollywood

2018-06-28 3 Dailymotion

Ravi Teja to do film with VI Anand. crazy movies in que for RaviTeja.ileana reentry confirmed in Tollywood. Ileana is female lead in Ravi Teja new film

మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టిక్కెట్టు చిత్రం ఆశించిన స్థాయి ఫలితం ఇవ్వలేకపోయింది. ఆడియన్స్ ని మెప్పించడంలో ఈ చిత్రం విఫలమైంది. అయినా కూడా రవితేజ కోసం వరుస చిత్రాలు క్యూ కడుతున్నాయి. రవితేజ, శ్రీనువైట్ల సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలాకాలం తరువాత ఓ చిత్రం రాబోతోంది. అమర్ అక్బర్ ఆంటోని అనే ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయంలో నటించబోతున్నాడు. ee chitra heroin kosam eliyana nu sampradhinchaga.... నడుము సుందరి ఇలియానాకు టాలీవుడ్ లో క్రేజ్ తగ్గలేదు. ఇలియానా ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించిందంటే అందుకు కారణం టాలీవుడ్ చిత్రాలే అని చెప్పొచ్చు. పోకిరి చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ గోవా బ్యూటీ తనవైపుకు తిప్పేసుకుంది. ఆ తరువాత జల్సా, జులాయి, కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. పెరిగిన క్రేజ్ తో ఇలియానా బాలీవుడ్ కు వెళ్లి ఆశాభంగం చెందిన సంగతి తెలిసిందే. ఇలియానాకు బాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు. ఆరా కోరా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది. తాజగా ఇలియానాకు మరో గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది. శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో రూపొందబోయే అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించే అవకాశం ఇలియానాకు వచ్చింది. మంచి అవకాశం రావడంతో ఇలియానా వెంటనే ఒప్పేసుకుంది.