Surprise Me!

Mahanati 50 Day Total Box Office Collections

2018-06-28 3 Dailymotion

Mahanati movie complete seven weeks in several cinema halls across the globe. Mahanati has collected approximately Rs 78 crore gross at the worldwide box office in 50 days. The film has become one of the blockbuster Tollywood movies of 2018. The movie has earned Rs 42 crore for its global distributors in 50 days.

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎవరూ ఊహించని రేంజిలో వసూళ్లు సాధించిన ఈ మూవీ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు వందశాతం లాభాలు తెచ్చిపెప్పింది. సినిమా విడుదలైన తొలి రోజు నుండే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువ వసూలు చేయడంతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి బ్యానర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రానంత అప్లాజ్, గొప్ప సినిమా అనే పేరు మహనటి సినిమా సొంతం చేసుకుంది. కొన్ని పెద్ద హీరోల సినిమాలతో క్లాష్ అయినా ఏ మాత్రం తగ్గకుండా వాటినే వెనక్కి నెట్టేసి టాప్ చార్టులో నిలుస్తూ వచ్చింది ‘మహానటి' బయోపిక్.
మహానటి' చిత్రాన్ని కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 78 కోట్ల షేర్ వసూలు చేయగా అందులో రూ. 42 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ‘మహానటి' చిత్రం మొత్తం రూ. 28.65 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ. 11.79 కోట్లతో నైజాం టాప్ పొజిషన్లో ఉండగా సీడెడ్ రూ. 2.98 కోట్లు, వైజాగ్ రూ. 4.01 కోట్లు, ఈస్ట్ రూ. 2.50 కోట్లు, వెస్ట్ రూ. 1.64 కోట్లు, కృష్ణ రూ. 2.49 కోట్లు, గుంటూరు రూ. 2.13 కోట్ల వసూలైంది.