Surprise Me!

FIFA World Cup 2018: Sister Dislocates Shoulder Celebrating Neymar's Goal

2018-06-28 203 Dailymotion

రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ కోస్టారికాపై కొట్టిన గోల్.. అతని చెల్లి చెయ్యి విరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే... టోర్నీలో భాగంగా శుక్రవారం బ్రెజిల్‌-కోస్టారికా జట్లు పోటీ పడ్డాయి. నాకౌట్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ కొట్టి బ్రెజిల్ విజయం సాధించింది.
మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందేమో అనిపించిన తరుణంలో ఆట 89వ నిమిషంలో నెయ్‌మార్ క్రాస్‌ షాట్‌ను అందుకునే క్రమంలో కోస్టారికా కీపర్‌ నెవాస్‌ గాయపడ్డాడు. దీంతో ఏడు నిమిషాలపాటు ఇంజ్యూరీ సమయం ఇవ్వడంతో 90+1లోనే బ్రెజిల్‌ సూపర్‌ గోల్‌తో బ్రెజిల్ తొలి గోల్ నమోదు చేసింది.