Surprise Me!

Samantha, Naga Chaitanya Movie Updates

2018-07-04 343 Dailymotion

ప్రేమజంటగా ఉన్న నాగచైతన్య, సమంత గత ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు వీరిద్దరూ పలు చిత్రాల్లో కలసి నటించారు. వివాహం తరువాత చై సామ్ కలసి నటించే తొలి చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. నిన్ను కోరి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
సమంత, చైతు ఈ చిత్రంలో వివాహం చేసుకున్న జంటగా కనిపిస్తారు. అనుకోకుండా వీరి జీవితాల్లోకి ఓ యువతి రావడంతో విడిపోతారట. తిరిగి మళ్ళీ వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారనేదే ఈ చిత్ర కథ. వివాహం తరువాత భార్య, భర్తల మధ్య ఉండే ప్రేమ విలువని చాటేలా ఈ చిత్రం ఉంటుందట.
రియల్ లైఫ్ లో ఒక్కటయ్యాక రీల్ లైఫ్ లో చై సామ్ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి. సమంత తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు చిత్రంతో నటిస్తున్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో అక్కినేని నటవారసుడు నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు చిత్రం రిలీజ్ డేట్‌ను ఆగస్టు 31గా చిత్ర యూనిట్ ఖారారు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ధృవీకరించింది.

Interesting story for Samantha, Naga Chaitanya movie. Siva Nirvana will going to direct this movie
#samantha
#naga chaitanya