తెలుగు ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంలో దశాబ్దకాలం గా టాప్ హీరోయిన్ గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మెహిని గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు భాషల్లో మెహిని గా ఈచిత్రం తెరకక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మిపిక్చర్స్ తెలుగు లో విడుదల చేస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్. శ్రినివాసరావు పల్లెల, కరణం మధులత,గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తి లు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం చేపట్టారు. ఆర్.మాదేష్ దర్శకుడు. హర్రర్ కామెడి బ్యాక్‌డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. మోహిన చిత్రంలో త్రిషతోపాటు జాకీ భగ్నానీ, యోగిబాబు, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా వుంది. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియోని విడుదల చేశారు. ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జులై 27న రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు.