#ThisHappened2019: Out of 16 matches they played in the year, they won nine and lost seven. With the World T20 to be played next year, India will have to start fine-tuning their bowling department.we look back at the top three bowlers of the year in the team.
#deepakchahar
#top3IndianT20Ibowlersin2019
#bhuvaneswarkumar
#navdeepsaini
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia
టీ20ల్లో 2019 సంవత్సరం టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది టీమిండియా ఆడిన 16 మ్యాచ్‌ల్లో కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో బౌలింగ్ విభాగంపై ప్రత్యేకంగా జట్టు మేనేజ్మెంట్ దృష్టి సారించింది.
అటు స్పిన్‌తో పాటు ఇటు పేస్ విభాగంలో ఈ ఏడాది టీమిండియా అనేక కాంబినేషన్లను ప్రయత్నించింది. వీటిలో చాలా వరకు అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాయి. 12 మ్యాచ్‌లు ఆడి 42.87 యావరేజితో కేవలం 8 వికెట్లు మాత్రమే తీయడంతో స్పిన్నర్ కృనాల్ పాండ్యా జట్టులో స్థానం కోల్పోయాడు.
ఇక, 8 మ్యాచ్‌లు ఆడి 37.14 యావరేజితో 7 వికెట్లు తీసిన పేసర్ ఖలీల్ అహ్మద్ పూర్తిగా నిరాశపరిచాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌లు ఆడిన సుందర్ 50 యావరేజితో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
2020లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-3 బౌలర్లను ఒక్కసారి చూద్దాం...