Surprise Me!

#IranvsUSA : ఇరాక్ అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్!!

2020-01-08 9 Dailymotion

ఊహించినట్టే- ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా ఎయిర్ బేస్, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సైతం ధృవీకరించింది. ఇరాక్ లోని తమ స్థావరాలపై క్షిపణి దాడులు చోటు చేసుకున్నాయని, వాటిని ఇరాన్ ప్రయోగించినట్లు అనుమానిస్తున్నామని స్పష్టం చేసింది.

ఇరాక్ రాజధాని బాగ్దాద్ పై అమెరికా వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత- అమెరికా, ఇరాన్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఈ దాడులకు పాల్పడిన అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా వైమానిక దాడులను అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది.
#IranvsUSA
#Iran
#Iraq
#USmilitaryForces
#QassemSuleimani
#USDefenseDepartment
#DonaldTrump