Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : MAA THALLI
పల్లవి : మా తల్లి అలమేలు మంగ శ్రీ పతి సరసన, నువు నడయాడంగ "2"
చరణం : వన భ్రమరమ్ములు, నల్లని కురులు
ముగ్ధ సోయగపు, ముసిముసి నగవులు "2"
పచ్చల హారములు, పీతాంబరము "2"
మణిమయ హారముల, చందన గంధి "మా తల్లి" "2"
చరణం : పలుకుల సొలపులు, మృదు మధురమ్ములు
ప్రాత: కాలపు, కోయిల స్వరములు "2"
పసిడి మువ్వల, సరి సవ్వడులు "2"
సంధ్యా రాగపు సరిగమల ఝురులతో "మా తల్లి"
చరణం : వేంకట రమణుని , పట్టపు రాణివి
హృదయము నందున వెలసిన, ఘన అలివేణివి "2"
సకల ప్రసాదిని, సద్గుణ వర్షిణి "2"
వైకుంఠుని ప్రియ గారాల భరణివి "మా తల్లి"