Jana Sena candidate Rapaka Varaprasad, who won from Rajolu constituency in the last elections, continues to be an associate member of the ruling YCP
గతఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ అధికార వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీ మారకుండా ఉండేందుకు పవన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన మాటలను ఎమ్మెల్యే పెడచెవిన పెట్టారు. ఈలోగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. మరో రెండు సంవత్సరాల సమయమే ఉంది. మళ్ళీ రాజోలు నుంచి ఆయన పోటీచేస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీటిస్తుందా? అంటే అవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
#RapakaVaraprasad
#Janasena
#Rajolu
#pavanKalyan
#AndhraPradesh
#YCP
#CMjagan