Real Estate Growth in Telangana : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ హయాంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది. వేగంగా అనుమతులు ఇవ్వడంతో కొత్త భవనాల నిర్మాణాల సంఖ్య సైతం పెరిగింది. గడిచిన ఏడు నెలల్లో 12.5 శాతం రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.