Surprise Me!

అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు : సీఎం రేవంత్ రెడ్డి

2025-01-26 7 Dailymotion

CM Revanth Launched Four Welfare Schemes : తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రూ.11.80 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. 734 మందికి రైతు భరోసా చెక్కులను రేవంత్ పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.