Hyderabad Boy Vishwanath Karthikeya Climbed Over Twenty Mountains : సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అయితే, సొదరి స్ఫూర్తితో మౌంటెనీరింగ్ వైపు అడుగులేశాడా కుర్రాడు. క్రమంగా పర్వతారోహణ హాబీగా మలచుకుని అనతి కాలంలోనే అందులో పరిణతి చెందాడు. 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలు అధిరోహించి ఔరా అనిపించాడు. అంతేకాదు, 4 ఏళ్ల వ్యవధిలోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ మౌంటెనీర్ ఎవరు? సాధించిన ఘనతలు ఏంటో మనమూ చూసేద్దామా