SLBC Tunnel Rescue Operation : శ్రీశైలం సొరంగం మార్గంలో సహాయక చర్యల కోసం ఇవాళ్టి నుంచి రోబోలను వినియోగించుకోనున్నారు. ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టన్నెల్‌లోని పరిస్థితులకు అనుగుణంగా రోబోలను సిద్ధం చేశారు. రోబోటిక్స్ ఎలా పని చేస్తాయి? ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతంలో ఎలా ఉపయోగపడతాయి అనే అంశాలపై ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఛైర్మన్ కిషన్ ఆయన మాటల్లో చెప్పారు.