నిన్న ఆర్సీబీ మీద కేఎల్ రాహుల్ అంతటి మాస్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత అంతటి వైల్డ్ సెలబ్రేషన్స్ చూసిన తర్వాత ఎవరికైనా ఓ డౌట్ రావొచ్చు. కేఎల్ రాహుల్ ఎందుకింత అగ్రెసివ్ గా మారిపోయాడు. ఈ రేంజ్ లో బీస్ట్ లా విరుచుకుపడ్డాడు అని. బట్ ఈ మారణహోమానికి రీజన్ ఏంటో తెలుసా. భయం. ఎస్ కేఎల్ రాహుల్ వర్షం వస్తుందేమోనని భయపడ్డాడు. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 14 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది ఢిల్లీ. సరిగ్గా ఆ సమయంలో పెద్దగా చినుకులు మొదలయ్యాయి. సో వర్షం పడటం ప్రారంభించింది. కానీ డకవర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ స్కోరు 107 పరుగులు ఉంటే వర్షం పూర్తిగా మ్యాచ్ నిర్వహణకు ఆటంకం కలిగించినా గెలుపు ఢిల్లీకి ఇస్తారు. అందుకే ఆ 8 పరుగుల లీడ్ పెట్టాలని బీస్ట్ అవతారం ఎత్తాడు రాహుల్. బౌలింగ్ చేయటానికి ప్రపంచ మేటి బౌలర్లలో ఒకడైన జోష్ హేజిల్ వుడ్ వ్చచినా లెక్కపెట్టలేదు రాహుల్. మొదటి బంతి కి ఫోర్, రెండు బంతికి ఫోర్, మూడు నాలుగు బంతులకు రెండేసి పరుగులు, ఐదో బంతికి ఫోర్, ఆరో బంతికి ఏకంగా సిక్సర్. మొత్తంగా హేజిల్ వుడ్ కి చుక్కలు చూపించి 22 పరుగులు లాక్కున్నారు ఆ ఒక్క ఓవర్ లోనే. ఫలితంగా DRS స్కోర్ కంటే ఎక్కువగా స్కోరు ఉంచటంతో పాటు మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు తిరిగి పోయింది. ఓ దశలో 29 బంతుల్లో 29 పరుగులు చేసిన రాహుల్ మ్యాచ్ ముగిసే సరికి 53 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. అంటే తన చివరి 24 బాల్స్ లో 64 పరుగులు కొట్టి ఢిల్లీని ఆరువికెట్ల తేడాతో గెలిపించాడు రాహుల్. సో అర్థమైందిగా ఇదంతా వాన వస్తుందేమోనని రాహుల్ పడిన భయమే..ఆర్సీబీ బౌలర్లను మెరుపు దెబ్బ కొట్టేలా చేసింది.