Surprise Me!

Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్

2025-04-19 4 Dailymotion

 ఆర్సీబీ జస్ట్ మిస్. నిజంగా జర్రుంటే సచ్చిపోయేవాళ్లు. 2017 నాటి 49 ఆల్ అవుట్ రికార్డును తనే బద్దలు కొట్టుకునేది ఆర్సీబీ. ఎందుకంటే నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పంజాబ్ బౌలర్ల ధాటికి విలవిలాడిపోయింది. పటీదార్, టిమ్ డేవిడ్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా సెల్ ఫోన్ నెంబర్స్ తలపించేలా సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుటయ్యారు. వాళ్లలో ప్రమాదకర ఓపెనర్ ఫిల్ సాల్ట్..కింగ్ విరాట్ కొహ్లీ ఉండటం దురదృష్టకరం. సాల్ట్, విరాట్ కొహ్లీలను అర్ష్ దీప్ సింగ్ పెవిలియన్ కు పంపిస్తే...బార్ట్ లెట్ లివింగ్ స్టన్ ను అవుట్ చేసి... 4ఓవర్ల పవర్ ప్లేలో 26 పరుగులకే ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయేలా చేశాడు. పోనీ పవర్ ప్లే తర్వాత ఏమన్నా ఇరగదీస్తారు అనుకుంటే మరింత దారుణం..ముందు పటీదార్ కి సపోర్ట్ ఇచ్చేవాళ్లు లేరు..తర్వాత టిమ్ డేవిడ్ కోసం ఎవరూ నిలబడలేదు. జితేశ్, కృనాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనోజ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఒకానొక దశలో 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. అప్పుడు మొదలయ్యాయి ట్రోల్స్. RCB వింటేజ్ ఫామ్ లోకి వచ్చేసిందని 49 పరుగుల తన అత్యల్ప స్కోరు రికార్డును బద్ధలు కొట్టేసుకుంటుదని అందరూ అంచనా వేశారు. బీభత్సంగా ట్రోలింగ్ చేశారు. అయితే టిమ్ డేవిడ్ ట్రోలర్స్ కి సమాధానం చెప్పాడు. పటీదార్ మినహా అందరూ చెతులెత్తేసిన ఆర్సీబీని మళ్లీ 49 పరుగుల్లోపు ఆలౌట్ కాకుండా పరువు కాపాడటమే కాదు స్కోరు బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు టిమ్ డేవిడ్. 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో కేవలం 4 సిక్సులు మాత్రమే నమోదు కాగా రజత్ 1 కొడితే..టిమ్ డేవిడ్ 3 సిక్సులు కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 14 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులైనా చేసి పరువు నిలుపుకుంది ఆర్సీబీ. అయినా కానీ ట్రోల్స్ ఆగటం లేదు 49 దాటారయ్యో తుస్సూ అంటూ ట్రోల్స్ పడుతున్నాయి ఇప్పటికీ ఆర్సీబీ మీద.