BRS Silver Jubilee Celebration : బీఆర్‌ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం(రేపు) సాయంత్రం జరగబోయే భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనాతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ ప్రాంగణాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సభ కోసం కాంగ్రెస్ నాయకులు సైతం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.