Surprise Me!

MS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP Desam

2025-04-27 5 Dailymotion

 ఈ సీజన్ లో దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ నెక్ట్స్ మ్యాచ్ లు సంగతి పక్కన పెట్టి నెక్ట్స్ సీజన్ కోసం ఫైనల్ 11 ను ఎలా తయారు చేయాలా అని ఆలోచనల్లో పడింది. అందులో భాగంగానే టీమ్ లో ఉన్న యువకులను చిన్న కుర్రాళ్లను వరుసగా రెండు మ్యాచుల్లో ఆడించాడు కెప్టెన్ ధోనీ. సీఎస్కేకి ఫ్యూచర్ గా భావిస్తున్న షేక్ రషీద్, డెవాల్డ్ బ్రూయిస్, ఆయుష్ మాత్రే, అన్షుల్ కాంభోజ్ లాంటి ఆటగాళ్లకు ఇప్పటికే అవకాశాలు ఇచ్చిన CSK వాళ్లు ఫర్వాలేదనిపించటంతో నెక్ట్స్ మ్యాచెస్ లో కమలేష్ నాగర్ కోటి, కీపర్ బ్యాటర్ వంశ్ బేడీలను పరిశీలించాలని అనుకుంటోంది. అసలు ఇంత మందిని మార్చాల్సిన అవసరం రావటానికి కారణం టీమ్ లో ఉన్న ఎవరూ ఆడకపోవటమే అన్నాడు ధోనీ. ఓ ఈవెంట్ లో CSK ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడిన ధోని..ఆడటం ఆడకపోవటం అనేది ఆటల్లో సహజమే అయినా...గెలవాలన్న తపన ఈసారి ఆటగాళ్లలో లోపించటం తనను కాస్త బాధ పెట్టిందన్నాడు. స్వతహాగా సీఎస్కేను స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొంటుందని అలాంటిది ఈ సీజన్ లో పేస్ తో పాటు స్పిన్ కు వికెట్లు కోల్పోవటం..పరుగులు చేయలేకపోవటం లాంటివి బాగా ఇబ్బంది పెట్టాయని ధోనీ విశ్లేషించాడు. ఇప్పటికే 9 మ్యాచుల్లో 19మందిని పరిశీలించామని టోర్నమెంట్ లో తమకు ఇక మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ ఇదే తరహా ప్రయోగాలు చేసి వచ్చే ఏడాదికి ఒక పర్ఫెక్ట్ 11 టీమ్ తయారు చేయాల్సిన బాధ్యత జట్టులో సీనియర్ గా తనపైన ఉందన్నాడు మాహీ. ఐపీఎల్ లీగ్ లో సీఎస్కే ఎప్పుడూ ఛాంపియన్ జట్టులానే ఉందని ఓటముల్లో కూడా తమ జట్టుకు యాజమాన్యం నుంచి అమితమైన మద్దతు ఉంటుందన్న ధోనీ అదే తమందరినీ ఓ కుటుంబంలా కలిపి ఉంచగలుగుతుందన్నాడు. రానున్న ఐదు మ్యాచుల మీద ఫోకస్ చేయటంతోపాటు కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి వచ్చే ఐదేళ్ల కోసం ఓ కోర్ టీ మ్ ను రూపొందించటమే ప్రస్తుతం తన లక్ష్యం అన్నాడు.