ఐపీఎల్ అంటే హీటెడ్ మూమెంట్స్ తో పాటు బోలెడన్నీ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. నిన్న రాజస్థాన్ తో ముంబైకి జరిగిన మ్యాచ్ లో అలాంటి క్యూట్ మూమెంట్స్ బోలెడు ఉన్నాయి. ఫస్ట్ ది సూర్య కుమార్ బాల్ కోసం ఊళ్లో తుప్పల్లో వెతికినట్లు వెతికాడు పాపం. రాజస్థాన్ బ్యాటర్ ఆర్చర్ కొట్టిన బాల్ ఫోర్ వెళ్లగా బాల్ వెళ్లి యాడ్ హోర్డింగ్స్ వెనకాల ఎక్కడో చిక్కుపోయింది. అక్కడకు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్ ఎంత వెతికినా బాల్ కనపడలేదు. సూర్యతో పాటు అక్కడున్న ఫోటో గ్రాఫర్లు మీడియా అంతా కలిసి వెతికినా బాల్ మాత్రం కనపడలేదు. ఈ బాల్ ఎక్కడికి పోయిందిరా అనుకుంటూ సూర్య బంతిని వెతుకుతున్న విధానం అందరికీ ఊళ్లలో బంతి కొడితే ఆ చెట్లలోకో పొద్దల్లోకి వెళ్లి వెతికే వాళ్లమో అలాంటి ఫీలింగ్ ను గుర్తు చేసింది. బాల్ ఎంతకీ దొరకకపోవటంతో అంపైర్లు కొత్త బాల్ ఇచ్చారు. రెండోది రోహిత్ శర్మ కాళ్లకు నమస్కరించిన బాల్ బోయ్. మ్యాచులు జరుగుతున్నప్పుడు యంగ్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేయటానికి గ్రౌండ్ లో బాల్ బోయ్స్ ను పెడతారు. అకాడమీల్లో క్రికెట్ ట్రైనింగ్ పొందే పిల్లలంతా అలా తమ ఆరాధ్య క్రికెటర్లను దగ్గర్నుండి చూసి స్ఫూర్తి పొందే అవకాశం అన్నమాట అది. అలా నిన్న తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు ఓ చిన్న కుర్రాడు. రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి పలకరించటమే కాకుండా రోహిత్ శర్మ కాళ్లకు నమస్కరించి తనకు హిట్ మ్యాన్ అంటే ఎంత ఇష్టమో చాటి చెప్పాడు. మూడోది సూర్య కుమార్ యాదవ్ కొట్టిన సిక్స్. రాజస్థాన్ బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బాల్ ను కూడా వెనుక వైపు సిక్సర్ గా మలిచిన సూర్య కుమార్ యాదవ్ దాని కోసం పడి పొర్లు దండాలు పెట్టాడు. రెండు మూడు పల్టీలు కొడితే లేవనంతగా రోల్ అయిపోతూ సూర్య కొట్టిన ఆ షాట్ ఫ్యాన్స్ ను అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.