Hariprasad Clears All India Civil Services : ఐఐటీ బాంబేలో చదువు ఆపై మల్టీ నేషనల్ కంపెనీలో ఐదంకెల మంచి జీతం. ఇవేవి అతడికి జీవితంలో సంతృప్తిని ఇవ్వలేదు. ఇంకేదో సాధించాలన్న తపన. ఇంకేదే మనసు కోరుతుందన్న వెలితి. అంతే అనుకున్నదే తడవుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌పై దృష్టి పెట్టారు. రెండు పర్యాయలు ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సక్సెస్ రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు, అధైర్యపడలేదు. అపజయాలనే గెలుపుకు పునాదిగా చేసుకుని ఈసారి మరింత పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 255 ర్యాంకు సాధించిన హనుమకొండకు చెందిన పోతరాజు హరిప్రసాద్‌తో ప్రత్యేక చిట్‌చాట్.