Vagdevi Laboratories : సినిమాల్లో చూస్తుంటాం.. నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, నేర సామ్రాజ్యం మూలాలను పెకిలించడానికి ఎలాంటి వేషమైనా వేస్తాడు, ఎంతటి సాహసానికైనా తెగిస్తాడు. సరిగ్గా అలాంటిదే, ఇంకా చెప్పాలంటే సినిమాను మించిన ఓ సాహసోపేత ఆపరేషన్ హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో వెలుగుచూసింది. అండర్‌కవర్ ఆఫీసర్ నుంచి పక్కా సమాచారం అందిన వెంటనే, ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు. మిరా భయాందార్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ చేరుకుంది. శనివారం చర్లపల్లి ఫేజ్-5, నవోదయ కాలనీలోని వాగ్దేవీ ల్యాబొరేటరీస్‌పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో కోట్లాది రూపాయల విలువైన 5.79 కిలోల మెఫిడ్రోన్ (MD డ్రగ్), దాని తయారీకి ఉపయోగించే 35,500 లీటర్ల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ల్యాబొరేటరీ యజమాని వోలేటి శ్రీనివాస్ విజయ్, అతని సహాయకుడు తానాజీ పట్వారీలను అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబయికి తరలించారు.
What looks like a movie scene happened for real in Hyderabad’s Charlapalli!
Mumbai Police, acting on an undercover tip-off, raided Vagdevi Laboratories and seized 5.79 kg of MD d*rug along with 35,500 liters of raw material worth crores of rupees.
Two suspects, including the lab owner, were arrested and taken to Mumbai on a transit warrant. A daring, cinematic-style operation that shocked Hyderabad!
#VagdeviLaboratories #Hyderabad #DrugBust #MumbaiPolice #Charlapalli #Mephedrone #MDDrug #OneindiaTelugu #oneindia #OIUpdates