IND vs NZ 2nd T20I Match Highlights | Raipur | Jan 23, 2026
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ ఊచకోతతో భారత ఏకపక్ష విజయాన్ని అందుకుంది.వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లోనే 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ , రచిన్ రవీంద్ర టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది.
IND vs NZ 2nd T20I Highlights | Suryakumar Yadav 82 & Ishan Kishan 76 | India Chase 209 in 15.2 Overs | 7-Wkt Win.
Chasing a mammoth target of 209 runs. India were rocked very early. Both opener Sanju Samson and Abhishek Sharma departed very quickly, Samson just made 6 with Abhishek scoring a duck. Coming into the crease under pressure, Ishan Kishan showcased his class with a superb knock.
#INDvsNZ #IndiaVsNewZealand #SuryakumarYadav #IshanKishan #INDvsNZ2ndT20I #T20Cricket #IndianCricket #CricketHighlights #TeamIndia
~PR.38~ED.232~