Surprise Me!

రూ.35 వేల విలువైన ఈ-సైకిల్​పై రూ.11 వేలు రాయితీ - సంతోషంలో లబ్ధిదారులు

2026-01-31 7 Dailymotion

Distribution Of E Cycles in Kuppam : పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 35 వేల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ సైకిళ్లను 11 వేల రూపాయల రాయితీపై లబ్ధిదారులకు అందించారు. సీఎం ఒకేరోజు 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి తన సొంతింటి నుంచి ప్రజావేదిక వరకు చంద్రబాబు సైకిల్​పై వచ్చారు. సీఎం దాదాపు 4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై సైకిల్‌పై వచ్చారు.

"ఈ-సైకిల్​ వల్ల పెట్రోలు ఆదా అవుతుంది. పిల్లలకు బైక్​లు ఇవ్వలేం. ఇది పిల్లలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఈ-బైక్​ల వల్ల పర్యావరణం మెరుగుపడుతుంది. ఈ-సైకిల్​ వల్ల పొలాల నుంచి గడ్డి, పాలు తీసుకువచ్చేందుకు ఈజీగా ఉంటుంది. ఒకసారి రీచార్జ్​ చేస్తే 40 కి.మీలు తిరగవచ్చు." -లబ్ధిదారులు 

కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించాం. నూతన చరిత్రకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. ఇంటిపై ఉత్పత్తయ్యే విద్యుత్‌తోనే సైకిల్‌కు ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఈ సూపర్‌ సైకిల్‌ ఒక్క పైసా ఖర్చు లేకుండా  దూసుకెళ్తుంది. సైకిల్‌కు ఓటు వేశారు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాం. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.-సీఎం చంద్రబాబు